క్షమించండి.. ఆ ఖర్చు నేనే భరిస్తా: మంత్రి

565చూసినవారు
క్షమించండి.. ఆ ఖర్చు నేనే భరిస్తా: మంత్రి
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. విశాఖ సమీపంలోని తాటిచెట్లపాలెం వద్ద మంత్రి కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదవశాత్తూ మరో కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీనిపై స్పందించిన మంత్రి.. "జరిగిన ప్రమాదానికి క్షమాపణ చెబుతున్నా. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని నా భద్రతా సిబ్బందిని ఆదేశిస్తా. అలాగే మీ వాహన డ్యామేజీకి అయ్యే ఖర్చును భరిస్తా' అని రిప్లై ఇచ్చారు.

సంబంధిత పోస్ట్