యువ దంపతుల ఆత్మహత్య.. అనాథలైన చిన్నారులు

1067చూసినవారు
యువ దంపతుల ఆత్మహత్య.. అనాథలైన చిన్నారులు
నెల్లూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 11వ డివిజన్‌లోని ఎన్టీఆర్‌ నగర్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతంలో కాకర్ల నాగరాజు (21), సురేఖ (19) నివాసం ఉంటున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న వీరికి రెండేళ్లలోపు వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. చిన్న వయస్సులోనే భార్యాభర్తలు మృతి చెందడంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్