64 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతోంది: చంద్రబాబు

56చూసినవారు
64 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతోంది: చంద్రబాబు
64 రోజుల్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం రాబోతోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మాడుగులలో ‘రా.. కదలిరా’ బహిరంగ సభ ప్రసంగించారు. జగన్ సర్కార్ కరెంట్‌ ఛార్జీలు పెంచి రూ.64 వేల కోట్ల భారం మోపిందన్నారు. 'జగన్‌ బటన్‌ నొక్కితేనే ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. జగన్‌ బటన్‌ పుణ్యం వల్లే చెత్తపన్ను వచ్చింది. జగన్‌.. జాబ్‌ క్యాలెండర్‌కు ఎందుకు బటన్‌ నొక్కలేదు?. జాబు రావాలంటే బాబు రావాల్సిందే' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్