తలలు బకెట్లలో ముంచేసి ఇద్దరు కుమారులను చంపిన తండ్రి.. ఆపై!

58చూసినవారు
తలలు బకెట్లలో ముంచేసి ఇద్దరు కుమారులను చంపిన తండ్రి.. ఆపై!
AP: పిల్లల కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచి ఊపిరి తీశాడు ఓ తండ్రి. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రశేఖర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీ కార్యాలయంో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. జోషిల్ (7), నిఖిల్ (6) పిల్లలున్నారు. ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని, దాంతో వారిని చంపేసినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్