హైబీపీ సమస్యను అదుపులో ఉంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఆకుకూరలు, కూరగాయలు, బెర్రీలు, అరటిపండ్లు, ఓట్స్ పొటాషియం సమృద్ధిగా కలిగి ఉండి బీపీ నియంత్రణకు సహాయపడతాయి. వారంలో కనీసం రెండు సార్లు చేపలు తినడం, వెల్లుల్లి, బీట్‌రూట్ ఆహారంలో చేర్చుకోవడం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో బీపీ నియంత్రణలో ఉంచుకోవచ్చు.