AP: ఈసారి కడపలో మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ అధిష్ఠానం నిర్వహించనుంది. మే నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు స్థల పరిశీలనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెళ్లారు. వేదిక ఏర్పాటుకు కడపలో నాలుగు ప్రాంతాలను పల్లా పరిశీలించారు. స్థల పరిశీలనలో ఆయనతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, మండిపల్లి రాంప్రసాద్ ఉన్నారు.