1945 ఏప్రిల్‌లో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి ఏర్పాటు సమావేశంలో అంతర్జాతీయంగా ఒక ఆరోగ్య సంస్థను నెలకొల్పాలని వివిధ సభ్య దేశాలు సూచించాయి. దీని ప్రకారం, యూఎస్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజ్యాంగాన్ని రూపొందించింది. 1946, జులై 22న 61 సభ్య దేశాలు దీనికి అనుకూలంగా ఓటు వేశాయి. తర్వాత 1948, ఏప్రిల్ 7న డబ్ల్యూహెచ్ అధికారికంగా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఇందులో 194 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.