వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం కాబోతోందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. బెంగుళూరు కేంద్రంగా కాంగ్రెస్‌తో జగన్ డీల్ కుదుర్చుకున్నాడని ఆరోపించారు. కూటమి 100 రోజుల పాలన చూసి వైసీపీలో భయం మొదలైందని.. అందుకే తల్లి కాంగ్రెస్‌లో పిల్ల కాంగ్రెస్‌ను కలపాలని చూస్తున్నారన్నారు. ఈ విషయం తెలిసే కీలక నేతలు కూటమి ప్రభుత్వంపై మొగ్గు చూపుతున్నారన్నారు.