కడప జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీ, బీజేపీ గ్రూపుల మధ్య ఘర్షణ

58చూసినవారు
కడప జిల్లా ముద్దనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, బీజేపీ గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. టీడీపీ గ్రూపునకు మద్యం షాపు వచ్చింది. దీంతో ఆయన షాపు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బీజేపీ గ్రూపు నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరుగ్రూపుల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మద్యం షాపును మూసి వేయించి, ముద్దనూరులో పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్