సత్యనారాయణపురంలో ఉద్రిక్తత

61చూసినవారు
సత్యనారాయణపురంలో ఉద్రిక్తత
విజయవాడలోని సత్యనారాయణపురంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్‌టీఎస్ జంక్షన్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టేందుకు వీహెచ్‌పీ, బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైల్వే స్థలంలో విగ్రహం పెట్టడానికి అనుమతి లేదన్నారు. అది కార్పొరేషన్ స్థలమని, విగ్రహ ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని వీహెచ్‌పీ, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్