ఎమ్మెల్యేను అందుకే కొట్టా: ఓటర్ సుధాకర్ (వీడియో)

61చూసినవారు
తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్‌ను చెంప దెబ్బ కొట్టిన ఓటర్ సుధాకర్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ‘ఎమ్మెల్యే తన అనుచరులతో డైరెక్ట్‌గా పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు. క్యూలో వెళ్లండని చెప్పా. ఓటేసి వచ్చాక మీరెవరు చెప్పేందుకంటూ నన్ను కొట్టాడు. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు తెలీదు. నేనూ ఎమ్మెల్యేను కొట్టినట్లు తర్వాత తెలిసింది. నన్ను ఎమ్మెల్యే అనుచరులు తీవ్రంగా కొట్టారు. ఎమ్మెల్యేను కొట్టాలనే ఉద్దేశం నాకు లేదు.’ అని సుధాకర్ అన్నారు.

సంబంధిత పోస్ట్