రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘RRR’. ఈ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ‘RRR’ మూవీ డాక్యుమెంటరీ రామ్ చరణ్ కుమార్తె క్లీంకార టీవీలో చూస్తూ కేరింతలు పెట్టింది.‘తొలిసారి తన తండ్రిని టీవీలో చూసి క్లీంకార ఆనందం వ్యక్తం చేసింది’ అని పేర్కొంటూ ఉపాసన ఇన్‌స్టా ద్వారా వీడియోను పంచుకుంది.