AP: పిఠాపురం మండలం కుమారపురంలో 12,500 మినీ గోకులం షెడ్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించి మాట్లాడారు. ‘ఆవు బాగుంటేనే రైతు బాగుంటాడు. అప్పుడే దేశం బాగుంటుంది. గత ప్రభుత్వం వేలాది డెయిరీలను చంపేసింది. ఇష్టారాజ్యంగా అనవసర ఖర్చులు చేసింది. అందుకే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి కష్టపడుతోంది.’ అని పవన్ అన్నారు.