HYD పోలీసుల భారీ ఆపరేషన్‌.. 23 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

83చూసినవారు
HYD పోలీసుల భారీ ఆపరేషన్‌.. 23 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్టు
TG: HYD పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కవిత తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. వీరిపై తెలంగాణలో 30, దేశవ్యాప్తంగా 328 కేసులు నమోదయ్యాయన్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఆపరేషన్‌ చేపట్టామని చెప్పారు. వీరు వివిధ నేరాల్లో మొత్తం రూ.5.29 కోట్లు కాజేశారన్నారు. వారి నుంచి సెల్‌ఫోన్లు, చెక్‌బుక్‌లు, సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్