హైదరాబాద్‌ను తీర్చిదిద్దిన ఘనత మాదే: సీఎం చంద్రబాబు

79చూసినవారు
హైదరాబాద్‌ను తీర్చిదిద్దిన ఘనత మాదే: సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌ను తీర్చిదిద్దిన ఘనత తమదేనని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ‘సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలను నిజాం, బ్రిటిష్ వాళ్లు అభివృద్ధి చేస్తే.. నేను మూడో నగరం సైబరాబాద్‌ను తీర్చిదిద్దాను. దేశంలోనే నంబర్ 1 సిటీగా హైదరాబాద్‌ను మార్చాను. అప్పట్లోనే 8 లేన్ల రోడ్లకు రూపకల్పన చేశాం. రాష్ట్ర విభజన సమయంలో అందరూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అమరావతి కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తాం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్