AP: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పేర్ని నాని గోదాములో బియ్యం మాయం కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న గోదాం మేనేజర్ మానసతేజను అరెస్ట్ చేశారు. కోటిరెడ్డికి ఈ కేసులో ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.