స్పీకర్‌ను చేసి నా గొంతు నొక్కేశారు: అయ్యన్న (వీడియో)

57చూసినవారు
AP: స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను స్పీకర్‌గా నియమించి సీఎం చంద్రబాబు గొంతు నొక్కేశారని వ్యాఖ్యానించారు. దాంతో సభలో ఉన్న నాయకులు ఒక్కసారిగా నవ్వుకున్నారు. విశాఖలోని కశింకోటలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో ఘోరమైన ప్రభుత్వాన్ని చూశామని, స్పీకర్‌గా నియమించి నేడు ఆ పాలనపై విమర్శించే అవకాశాన్ని లేకుండా చేశారన్నారు.

సంబంధిత పోస్ట్