AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ఆలోచనలు ఏమి లేని దిగజారుడు బడ్జెట్ అని విమర్శించారు. మూలధన వ్యయం గురించి గొప్పలు చెప్పి తీరా రూ.32,712 కోట్లు మాత్రమే కేటాయించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. టీడీపీ సర్కార్ పనులు చేయడంలో కాకుండా అప్పులు తీసుకోవడంలో వేగంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.