తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం సాగునీటి ప్రాజెక్టులను టీడీపీ ప్రభుత్వమే చేపట్టిందని సీఎం చంద్రబాబు చెప్పారు. వెలిగొండ, తోటపల్లి ప్రాజెక్టులను తానే ప్రారంభించానన్నారు. తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టుతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యమని ప్రకటించారు. ఇప్పటికే దీనిపై కేంద్రంతోనూ మాట్లాడామని పేర్కొన్నారు.