తమిళంలో బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన తేరి సినిమాని రీమేక్ చేసి బాలీవుడ్‌లో రూపొందిన ‘బేబీ జాన్’ మూవీ అభిమానులను నిరాశ పరిచి భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే విషయం హరీష్ శంకర్ మీద ప్రెజర్ పెంచుతుంది. ఎందుకంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా తేరి రీమేక్. దీంతో హరీశ్ శంకర్‌కు ఇది భారీ పరీక్ష కానుంది. మరి ఆయన ఈ పరీక్ష ఎలా పాస్ అవుతారో లేదో చూడాలి.