బ్రిటిష్ ఆన్‌లైన్ వార్తాపత్రిక ‘ది ఇండిపెండెంట్’ ఇటీవల 21వ శతాబ్దపు 60 మంది ఉత్తమ నటుల జాబితాను విడుదల చేసింది. అయితే ప్రపంచంలోని అత్యుత్తమ నటుల జాబితాలో భారతదేశం నుంచి ఇర్ఫాన్ ఖాన్ మాత్రమే చోటు సంపాదించారు. 60 మంది జాబితాలో ఇర్ఫాన్ ఖాన్ 41వ స్థానంలో నిలిచారు. ఎంతో కష్టపడి చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ఇర్ఫాన్ మంచి గుర్తింపు వచ్చేసరికి మన మధ్య లేకపోవడం బాధాకరం.