ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

57చూసినవారు
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
AP: రాష్ట్రంలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో సోమ‌వారం వ‌ర్షాలు కురుస్తాయ‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ వెల్ల‌డించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు 18 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని వివ‌రించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్