చంద్రగిరి మండల వ్యాప్తంగా అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. వర్షం కురవడంతో వాగులు, వంకలు పారుతున్నాయి. స్వర్ణముఖి నది పారడంతో జలకళ సతరించుకుంది. అయితే వర్షంతో పాటు చలి తీవ్రంగా ఉండటంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇవాళ కూడా భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.