తిరుచానూరు: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

51చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ ఈవో జే. శ్యామల రావు, జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, సీవీఎస్వో శ్రీధర్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్