తిరుపతి జిల్లాలో రెచ్చిపోయిన దుండగులు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లిలో శనివారం రాత్రి దుండగులు రెచ్చిపోయారు. నిజగురు మఠం స్వామిజీపై దాడికి పాల్పడ్డారు. మామిడి తోట కోసం రోడ్డును ధ్వంసం చేసి మట్టి తరలిస్తున్నారని, ఎందుకు నాశనం చేస్తున్నారని ప్రశ్నిస్తే కర్రలు, రాళ్లతో దాడి చేశారని వాపోయారు. తనపై ఏపీ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊక విజయ్‌కుమార్ అనుచరులు దాడి చేశారని స్వామీజీ తెలిపారు.