తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఏనుగుల వల్ల రైతులకు తీరని నష్టం జరుగుతోందని, పరిహారం చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. శనివారం శాసనసభలో ఆయన చంద్రగిరి నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందించి రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.