
తిరుపతి: ఇద్దరు వాహన దొంగల అరెస్టు
తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను తిరుచానూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 7. 3 లక్షలు విలువ చేసే మూడు ట్రాక్టర్లు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుచానూరు ఎస్ఐ అరుణ తెలిపారు. నిందితులు తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాకు చెందిన అన్బురాజన్, రాజా గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.