చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పోలీసులు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 31 ఫిర్యాదులు అందినట్టు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. పిర్యాదులను విచారించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ పోలీసులను ఆదేశించారు.