విడవలూరు మండలంలోని శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి తెప్పోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. విశేష పుష్పాలతో అలంకరించిన తెప్పపై శివ పార్వతుల దంపతులు కోనేరులో విహరించారు. బాణా సంచాలతో మంగళ వాయిద్యాలతో ఈ కార్యక్రమం ఘనంగా సాగింది. భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.