పుత్తూరు పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్

67చూసినవారు
పుత్తూరు పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్
నగిరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ మంజునాథ్ గౌడ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అను థీమ్ తో పలు రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తామన్నారు. మాస్ క్లీన్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచుకోవడం, చెత్త కుప్పలను తొలగించడం లాంటి పనులు చేపడుతామని తెలిపారు.