పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

65చూసినవారు
అంగన్వాడీ కేంద్రాలలో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ నజ్మా సూచించారు. పట్టణంలోని రంగాపురం అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవం శుక్రవారం నిర్వహించారు. గర్భవతులు, బాలింతలు తగిన పౌష్టిక ఆహారం తీసుకోకపోతే రక్తహీనత ఏర్పడే అవకాశం ఉందని ఆమె చెప్పారు. స్థానికంగా, చౌకగా లభించే ఆకుకూరలు, బెల్లం, తృణధాన్యాలతో పోషకాలు లభిస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్