ఈ నెల 25వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్న 108 సిబ్బందికి ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ శనివారం మద్దతు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులకు సాటిగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్న 108 ఉద్యోగులను సంస్థలు ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే అధికారులందరికీ సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.