సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో ఆదివారం అకస్మాత్తుగా ఓ మోస్తరు వర్షం కురిసింది. తెల్లవారుజామున నుంచి మంచు దుప్పటి కప్పుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా వర్షం కురిసింది. అనంతరం ఎండకాస్తుండడం విచిత్రంగా ఉందని స్థానికులు తెలిపారు. ఒకేరోజులో చలి, ఎండ, వాన ఎప్పుడూ చూడలేదన్నారు.