నాగలాపురం: సంతలో టపాకాయల దుకాణం

53చూసినవారు
నాగలాపురంలో ధర్మరాజు స్వామి ఆలయం వద్ద ప్రతి బుధవారం వారపు సంత నిర్వహిస్తుంటారు. సత్యవేడు మండల రెవెన్యూ, పోలీసు అధికారులు దీపావళికి టపాసులు విక్రయ కేంద్రం సంత స్థలంలో ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు. దీపావళి పండుగ వేళ వేలాది మంది జనం సంతకు రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. కాగా టపాకాయల దుకాణంలో ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్