శేషాచలం అడవుల్లో దారితప్పిన బీటెక్ విద్యార్థుల్లో ఒకరు చనిపోయారు. శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు యువకులు కోడూరు సమీపంలోని శేషాచలం అడవుల్లో ఉన్న గుంజనేరు జలపాతాలను చూసేందుకు శుక్రవారం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దారితప్పారు. ఇందులో దత్తసాయి(26) అనే యువకుడు వాగులో పడి చనిపోయాడు. మిగిలిన వారిని కోడూరు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సురక్షితంగా తీసుకు వచ్చారు.