శ్రీకాళహస్తి: పాఠశాలలో హరిత దీపావళి సంబరాలు

68చూసినవారు
శ్రీకాళహస్తి: పాఠశాలలో హరిత దీపావళి సంబరాలు
శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలో బుధవారం హరిత దీపావళి సంబరాలు నిర్వహించారు. హెచ్ఎం బృందాదేవి, పర్యావరణానికి హాని కలగకుండా పండుగను సాంప్రదాయాల మేర నిర్వహించాలని సూచించారు. పండుగలు మన సంప్రదాయాన్ని తెలియజేస్తాయని అన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, పాఠశాలలో దీపాలతో ఏర్పాటు చేసిన శివలింగం ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్