మూడు టిప్పర్లు పట్టివేత

62చూసినవారు
మూడు టిప్పర్లు పట్టివేత
తడ మండలంలోని మాంబట్టు చెరువు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లను గురువారం తడ రెవిన్యూ అధికారులు పట్టుకున్నారు. మాంబట్టు చెరువు నుండి అక్రమంగా మట్టిని టిప్పర్ల ద్వారా మాంబట్టు రోడ్డు గుండా జాతీయ రహదారిపైకి వస్తుండగా వీఆర్వో ఉషారాణి రెవిన్యూ సిబ్బంది సహకారంతో మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లను అదుపులో తీసుకొని తడ పోలీస్ స్టేషన్ కు అప్పచెప్పారు.

సంబంధిత పోస్ట్