ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలోని రేణమాల, తూర్పు పాలెం గ్రామాల్లో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మామిళ్ళపల్లి ఓంకార్ ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది గురువారం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.