AP: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. "వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను." అని పవన్ పేర్కొన్నారు.