తెలంగాణ ప్రభుత్వం 'గేమ్ ఛేంజర్' మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతించింది. తొలి రోజు ఉ.4 గంటల షోతో సహా 6 ఆటలకు అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.150 చొప్పున పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 19 వరకు 5 షోలకు అనుమతి ఇస్తూ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున పెంచుకోవచ్చని తెలిపింది.