గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ఈ నెల 10న విడుదల కానుంది. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, పోస్టర్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక, తాజాగా చిత్ర బృందం మేకింగ్ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. తెర వెనుక ఏం జరిగిందో మీరూ చూసేయండి.