AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందడం తనను తీవ్ర మనోవేదనకు గురయ్యానని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. "వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల నేపథ్యంలో తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తొక్కిసలాటలో నలుగురు భక్తులు మృతి చెందడం నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఇటువంటి అవాంచనీయ ఘటనలకు తావీయకుండా టిటిడి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది." అని లోకేష్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.