రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటంతో ఏపీలో రానున్న మూడు నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, శ్రీకాకుళం, మన్యం, కోనసీమ, ప.గో, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.