AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను టాలీవుడ్ పెద్దలు రెండు, మూడు రోజుల్లో భేటీ కానున్నట్లు సమాచారం. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.