బీహార్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రోహతాస్ జిల్లా ససారం జాతీయ రహదారిపై పఖ్‌నారీ సమీపంలో ఆపిన ట్రక్కులో ఆకస్మాత్తుగా ఆదివారం రాత్రి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ట్రక్కు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.