నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడనే వాదనలు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. ఎంపీడీవోను బ్లాక్ మెయిల్ చేసిన కీలక నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ బర్కత్ పుర యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సింగణమల పోలీసుల అదుపులో సైబర్ నిందితుడు ఉన్నాడు.