ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 30న వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. పండుగ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ సంస్థలు అధికారులు పాల్గోనాలని పవన్ కళ్యాణ్ కోరారు. కాగా డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికారులు ఈ నెల 30న జరిగే వన మహోత్సవ కార్యక్రమాలకు తగిన ఏర్పాట్లను చేసే పనిలో నిమగ్నమయ్యారు.