రుణమాఫీ కాలేదని రోడ్డెక్కిన రైతులు (వీడియో)

84చూసినవారు
తెలంగాణలో రుణమాఫీ ప్రయోజనం దక్కని రైతులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. తమకు ఎందుకు రుణమాఫీ కావడం లేదన్న ఆగ్రహంతో రైతులు నిరసన బాట పడుతున్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంలో రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదంటూ శుక్రవారం రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి ఏలాంటి షరతులు లేకుండా రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్