Feb 14, 2025, 12:02 IST/ఆసిఫాబాద్
ఆసిఫాబాద్
వాంకిడిలో యాక్సిడెంట్.. వ్యక్తికి తీవ్ర గాయాలు
Feb 14, 2025, 12:02 IST
బైకు అదపు తప్పి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన వాంకిడి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం సిర్పూర్ టీ నుంచి ఓ వ్యక్తి మహారాష్ట్ర వైపుకు తన బైక్ పై వెళ్తున్న క్రమంలో వాంకిడి మండలం గోయగాం గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. అతడికి తీవ్ర గాయాలవగా స్థానికులు గమనించి అంబులెన్స్ లో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.