ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ తాజాగా గ్లోబల్ కార్డ్ నెట్‌వర్క్ రూపే భాగస్వామ్యంతో కొత్తగా "ఫస్ట్ ఎర్న్' పేరుతో యుపిఐ ఆధారిత రూపే క్రెడిట్ కార్డును ఆవిష్కరించినట్లు తెలిపింది. దీంతో చేసే యుపిఐ చెల్లింపులపై ఒక్క శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్లు పేర్కొంది. ఈ ఫిక్సుడ్ డిపాజిట్ ఆధారిత కార్డును ఆన్‌లైన్‌లో పొందవచ్చని ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఫాస్టాగ్, లాయల్టీ హెడ్ శిరీష్ భండారీ పేర్కొన్నారు.